పూజలు/ సేవలు

మాలయిడల్ :
శబరిమల యాత్ర ఇంద్రియాలకు పరీక్ష.  భక్తులు సాధారణమైన నిశ్చల జీవనాన్ని ’వ్రతం’ అనే పేరుతో జీవించి, యాత్రను పూర్తిచేయాలి.
’వ్రతం’ భక్తుడు మాల ధారణ చేసిన నాటి నుంచి, బ్రహ్మచర్యాన్ని పాటించడంతో ప్రారంభమౌతుంది.  
పూసల మాలలో అయ్యప్ప స్వామి బొమ్మ గల పతకంతో మాలను ధరించిన నాటినుంచి భక్తుడు ప్రాపంచిక సుఖాలకు దూరంగా ఉండాలి.
పొగాకు, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి.
విధిగా పూజ చేసిన తర్వాత, పూజారి చేతగాని, 18 సార్లు శబరిమల యాత్ర పూర్తి చేసిన గురుస్వామి చేత గాని మాల ధారణ చేయవచ్చు.
తమ ఇంటిలోని పూజగదిలో కూడా మాల వేసుకోవచ్చు.
మాల యాత్ర పూర్తయిన తర్వాతనే తీయాలి.

మండల వ్రతం :
మండలవ్రతం – బ్రహ్మచర్యంతో 41 రోజులు మాల ధరించి అయ్యప్పస్వామి భక్తులు విధిగా వ్రతముండాలి. సాధారణమైన, నిశ్చలమైన జీవితం గడపాలి. మాల ధారణ వ్రతారంభం. ఆదివారం గాని ఉత్తర నక్షత్రం
(ఉత్తర శ్రీ అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం) ఉన్న రోజుగాని మాల ధరించడం విశేషంగా భావిస్తారు.
41 రోజుల వ్రతం లెక్క మంచి క్రమశిక్షణను అలవరచుకొని దాన్ని అలవాటుగా మార్చుకోడానికి. నిగ్రహం, ప్రార్థనలతో మంచి అలవాట్లను, ఇంద్రియ నిగ్రహాన్ని అల్వరచుకోడమే. వ్రతకాలంలో ’నల్లరంగు’ వస్త్రాలను వాడడానికి కారణం, నలుపు అన్నిటికీ దూరంగా ప్రాపంచిక సుఖాలను నిగ్రహించడాన్ని సూచిస్తుంది. గోళ్ళు కత్తిరించటం, క్షవరం చేసుకోవటం, వెంట్రుకలు కత్తిరించటం నిషిద్ధం.

కెట్టు నిరక్కల్ :
శబరిమల యాత్ర కోసం ఇరుముడి కట్టడానికి తయారు కావటం. ఇది గురుస్వామి సహాయంతోనే జరుగుతుంది. ఇరుముడి తలపై మోస్తున్న వాళ్ళు మాత్రమే 18 మెట్లు ఎక్కి స్వామి దర్శనం చేసుకోడానికి అర్హులు. వాళ్ళే వ్రతాన్ని సరిగా పూత్రి చేసి శుచిగా దర్శనానికి వచ్చినట్లు భావింపబడతారు.
మిగిలిన భక్తు వేరే దారి గుండా గర్భగుడి చేరుకొని స్వామి దర్శనం చేసుకోవచ్చు.
పూజ తర్వాత పవిత్ర సేవగా భావింపబడే నేతిని కొబ్బరికాయలోని ఒక కన్ను తొలగించి అందులో నింపుతారు.
కొబ్బరికాయలోని నీటిని ఆ సన్నటి రంధ్రంద్వారా తీసివేసి, నెయ్యి నింపటం ఒక ప్రతీకాత్మక చర్య. అది ప్రాపంచిక ఆశలను తీసివేసి మనసులో ఆధ్యాత్మిక భావనలను నింపటానికి సమానంగా భావిస్తారు. కొబ్బరికాయను మలయాళంలో ’తేంగాయ్’ అంటారు, నెయ్యి నింపబడిన కొబ్బరికాయ ’నెయ్ తేంగా’ గా పిలవబడుతుంది.
ఇరుముడిలో ముందు భాగంలో నెయ్యితేంగా, అయ్యప్పకు, ఇతర దేవతల పూజకు కావలసిన పూజా ద్రవ్యాలు వేసి, దాన్ని తాడుతో కడతారు. ఆ ముందు భాగం ఆధ్యాత్మిక శక్తితో నిండిందిగా భావిస్తారు. తర్వాత వెనుక భాగంలో కొన్ని కొబ్బరికాయలుంచుతారు. అవి వివిధ ఆలయాలలో పుణ్యస్థలాలలో కొడతారు.

పేట్ట తుళ్ళల్ :
పేట్టతుళ్ళల్, ఆచారంగా వస్తున్న పవిత్రంగా భావింపబడే నృత్యం. మహిషిని అయ్యప్పస్వామి సంహరించినందుకు గుర్తుగా ఆనందంతో చేసేది.ఇది శబరిమల యాత్రాకాల సమాప్తికి కూడా గుర్తు.
అంబలపుళ గుంపు వాళ్ళు ఆచారప్రకారం ఈ పేట్ట తుళ్ళల్ చేసేవారు.
1000 మంది ఉన్న గుంపు ఆకాశంలోకి గాలి పటాన్ని ఎగరవేసి, పేట్ట జంక్షన్ లో ఉన్న కొచ్చంబలం లో ఈ తుళ్లల్ ను ప్రారంభించేవారు. ఈ నృత్తం చేస్తున్న గుంపు నయ్నార్ మసీదులోకి ప్రవేశించి, అయ్యప్పన్ కు నమ్మకస్థుడైన వావర్ ను దర్శిస్తారు.
వాళ్ళను ఎరుమేలి మహల్లు జమ్మత్ సంస్థ నాయకులు ఎదురెళ్ళి పిలిచి, వాళ్లతో పాటు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న శ్రీధర్మశాస్తా గుడి, వలియంబలం వరకు వస్తారు. అక్కడ వాళ్ళందరినీ తిరునంతపుతరం దేవస్వోం బోర్డు వాళ్ళు  స్వాగతిస్తారు.
ఆలంగాడ్ గుంపు తమ నృత్యాన్ని, మధ్యాహ్నం పగటి వేళ నింగిలో చుక్క కనిపించాక ప్రారంభిస్తారు. ఈ రెండు గుంపులూ వలియంబలంలో ఆ రాత్రి ఉండి తర్వాత పంపకు పయనిస్తారు. ఆతర్వాత సన్నిధానంలో  మకరవిళక్కు పండుగలో పాల్గొంటారు.

గుడి చేరే దారి :
శబరిమల చేరడానికి, ఎరుమేలి, వండి పెరియార్, సాలక్కాయం అని చాలా దారులున్నాయి. ఎరుమేలి గుండా వెళ్ళే దారినే అసలు దారిగా భావిస్తారు. ఎందుకంటే, మహిషిని సంహరించడానికి అయ్యప్ప ఆ దారి గుండా వెళ్ళినట్లు చెప్తారు. ఇది చాలా కఠినమైన దారి, అడవులు, కొండల గుండా 61 కి.మీ దూరం పయనించాలి.
ఈ ఎరుమేలి దారిలో పయనించే భక్తులు శబరిమల చేరే లోపు మరికొన్ని ముఖ్యస్థలాలు దర్శిస్తారు. ఎరుమేలి ధర్మశాస్తా, వావర్ల దర్శనంతో వాళ్ల యాత్ర ప్రారంబమవుతుంది.
అక్కడనుంచి 4 కి.మీ దూరంలో పేరూర్ తోడు, అనే స్థలం ఉంది. అక్కడే అయ్యప్ప తన ప్రయాణంలో సేద తీరాడు, కనుక అక్కడ నుంచే శబరి మల పాద స్థానం కనుక అది ముఖ్యమైంది. ఇక్కడ అయ్యప్పకు కానుకలు సమర్పించుకొంటారు. అయ్యప్ప శరణంటారు. పేరూ తోడు తర్వాత వచ్చే అడవిని ’పూంగావనం’ అంటారు.
ఈ దారిలో తర్వాతి స్థలం కాళకట్టి. ఇది పేరూర్ తోడుకు 10 కిమీ దూరంలో ఉంది. మలయాళంలో ’కాళ’ అంటే ఆంబోతు. పరమశివుడు ఇక్కడ తన నండిని కట్టేసి, అయ్యప్ప మహిషిని సంహరించడాన్ని చూశాడని చెప్తారు. ఇక్కడి గుడిలో భక్తులు కొబ్బరికాయ కొట్టి, కర్పూరం వెలిగిస్తారు.
కాళకట్టి నుంచి 2 కిమీ దూరంలో అళుదానది ఉంది. పంపకు ఉపనది. భక్తులు అళుదానదిలో గులకరాళ్ళను సేకరించి అళూదా కొండ ఎక్కుతారు. 2 కిమీ దూరం ఉండే నిటారైన కొండ దారి చాలా కఠనమైంది. అక్కడనుంచి భక్తులు తాము సేకరించిన గులకరాళ్ళను లోయలోకి విసురుతారు. ఇది మహిషి కాయాన్ని లోయలోకి విసిరిన దాన్ని జ్ఞానపకార్థమని భావిస్తారు.

దారి – 2
ఇంజిపారక్కోట్ట కొండ ఎక్కినతర్వాత దిగే దారి ఇది. ఇక్కడ శాస్తాకు ఒక గుడి ఉంది. ఇక్కడి శాస్తాను కోటయిల్ శాస్తా అంటారు. భక్తులు అతన్ని కొలిచి ముందుకు వెళతారు. కిందికి దిగే ఈ దారి చాలా జారుడుగా ఉంటుంది. ఇది కరిమలతోడు దగ్గరకు చేరుస్తుండి. ఈ కాలువకు ఒకవేపు అళుద కొండ, మరొక వేపు కరిమల కొండ ఉంటాయి.

ఉల్సవం :
ఉల్సవం – ప్రతి సంవత్సరం మలయాళ నెలల్లో మీనం లోను, తమిళ నెలల్లో పంగుణి ( మార్చ్- ఏప్రిల్) లలో జరిగే ఉత్సవం. ఈ ఉత్సవకాలంలో శబరిమల గుడి 10 రోజులు తెరిచి ఉంటుంది.
ఉత్సవం గుడి పతాక ఎగురవేయటంతో ప్రారంభమౌతుంది. దాన్ని ’కొడియేత్తం’ అంటారు. తర్వాత కొన్ని ముఖ్యమైన పూజలు జరుగుతాయి. వాటిలో ’ఉల్సవబలి’ ’శ్రీ భూత బలి’ వంటివుంటాయి. తొమ్మిదో రోజు ’పళ్ళివేట్ట’ లో శ్రీ అయ్యప్ప స్వామి శరంగుత్తికి వేటకు వెళతాడు.
దీని తర్వాత పంపానదిలో ’ఆరాట్టు’ అనబడే మంగళస్నానం చేయిస్తారు.
కొన్ని విశేషపూజలతో ’పంగుణి ఉత్తరం’ ముగుస్తుంది. ఉత్తరా నక్షత్రం శ్రీ అయ్యప్పస్వామి జన్మతార.